ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పుష్ప 2' తమిళ వెర్షన్ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఛానల్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 02:38 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన  పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే మూవీ మేకర్స్ విడుదల చేసిన పుష్ప 2 ఫస్ట్-లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది.


తాజాగా ఈ సినిమా తమిళ వెర్షన్ శాటిలైట్ హక్కులను స్టార్ విజయ్ ఛానల్ సొంతం చేసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు.


ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com