ఆ బ్రహ్మే నిను చెయ్యడానికే
తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే
అందాల నీ కంటి కాటుకతో
రాసే ఉంటాడే నా నుదిటి రాతలనే
కుంకుమలా నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షానయ్యా వేడుకలాగా
మౌనంగా మనసే మీటే
మధురాల వీణవు నువ్వే
ప్రతి ఋతువుల పూలే పూసే
అరుదైన కొమ్మవు నువ్వే
బ్రతుకంతా చీకటి చిందే
అమావాసై నేనే ఉంటే
కలిశావే కలిగించావే దీపావళి కలనే
జాబిల్లే నీ వెనకే నడిచేనే టెన్ టు ఫైవ్
నీ వెన్నెలనడిగేనే నీ వన్నెలనడిగేనే
అందాల నీ కంటి కాటుకతో పైవాడే
రాసే నా నుదిటి రాతలనే
కుంకుమలా నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షానయ్యా వేడుకలాగా
పమగమ గసరీగా పా పమగమ గసరీగా
గసనీగా దనిమాగ దనిపమగా మా