ఎన్నికల్లో పోటీపై ‘చిరుత’ బ్యూటీ నేహా శర్మ స్పందించింది. తగినంత టైం లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయడం కుదరలేదని తెలిపింది. ఆరు నెలల ముందు చెప్పి ఉంటే ఎన్నికల్లో పోటీ చేసేదాన్ని అని పేర్కొంది. అవకాశం వస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని నేహా తెలిపింది.నేహాశర్మ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని ఆమె తండ్రి అజయ్ శర్మ స్వయంగా వెల్లడించడం గమనార్హం.ప్రస్తుతం అజయ్ శర్మ బీహార్ రాష్ట్రంలో భాగల్ పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మహాఘట్ బంధన్ సీట్ల పంపకం గురించి చర్చల అనంతరం తమ పార్టీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తే తన కూతురు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని నేహా శర్మ తండ్రి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి భాగల్ పూర్ నియోజకవర్గం కావాలని అది మా కంచుకోట అని ఆయన తెలిపారు. మాకు ఈ సీటు వస్తే ఎవరు పోటీ చేయాలనేది పార్టీ హై కమాండ్ పై ఆధారపడి ఉంటుందని అజయ్ శర్మ పేర్కొన్నారు.