ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ తాప్సీ?

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2024, 01:24 PM

హీరోయిన్ తాప్సీ తన ప్రియుడు మథియాస్ బోను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 23న ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి పలువురు నటీనటులు ఈ పెళ్లికి హాజరైనట్లు సమాచారం. మథియాస్‌తో గత పదేళ్లుగా తాప్సీ డేటింగ్ చేస్తున్నట్లు ఆమె పలు సందర్భాల్లో వెల్లడించింది.
ఇక తాప్సీ కూడా తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ మథియస్ బోను సీక్రెట్గా పెళ్లాడిందట. గత పదేళ్ల నుంచి ఈ జంట రిలేషన్షిప్లో ఉంది. ఈ విషయాన్ని తాప్సీ అధికారికంగా ప్రకటించకపోయినా ఇది అందరికీ తెలిసిన రహస్యమే. ఉదయ్‌పూర్ లో తాప్సి పెళ్లి 23వ తేదీన జరిగిందట. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక జరగిందని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com