ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' నుండి సాగే నాదే సాంగ్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 09, 2025, 07:30 AM

విపిన్ దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు నరేష్ అగస్త్య తన రాబోయే ప్రాజెక్టును చేస్తున్నట్లు  ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్  మూవీ పై భారీ అంచనాలని పెంచాయి. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమాలోని థర్డ్ సింగల్ ని సాగే నాదే అనే టైటిల్ తో విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో రబీయా ఖాటూన్‌ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. రాధికా శరత్ కుమార్, విరాజిత, తులసి, సుమన్, తనికెళ్ల భరణి, ఆమనీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహనా కృష్ణ సినిమాటోగ్రఫీ మరియు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ఉన్నాయి. సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ కింద ఉమా దేవి కోటా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఆగష్టు 22న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa