|
|
by Suryaa Desk | Fri, Dec 08, 2023, 10:48 AM
కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించేందుకు.. ఎక్కువసార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. ప్రస్తుతం ఉన్నవారిలో కేసీఆర్ అత్యధికంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా ఉండాలని కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కోరితే.. ఆయన అంగీకరిస్తారా? లేదా? కాలికి గాయం కావడంతో అసెంబ్లీకి రాలేరా? అనేది చర్చనీయాంశంగా మారింది.
మాజీ సీఎం కేసీఆర్‌కు సోమాజిగూడ యశోద ఆస్పత్రి వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ ఎడమ కాలు తుంటి ఎముక దగ్గర గాయమైందని.. మరోసారి వైద్య పరీక్షలు చేశాక సర్జరీ అవసరమా? లేదా? అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లోని బాత్‌రూంలో కాలు జారీ కిందపడటంతో.. గాయపడ్డారు.