![]() |
![]() |
by Suryaa Desk | Fri, Dec 20, 2024, 03:10 PM
చేవెళ్ల మండల పరిధిలోని రావులపల్లి మాజీ సర్పంచ్ కేసారం శ్రీనివాస్ కు బహుజన సాహిత్య అకాడమీ వారు ఉత్తమ సర్పంచ్ అవార్డు ప్రకటించి, గత ఆదివారం రోజు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆ అవార్డును అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవార్డును దక్కించుకున్న కేసారం శ్రీనివాస్ కు బుధవారం సాయంత్రం రావులపల్లి గ్రామస్తులు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
అనంతరం ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలువురు మాట్లాడుతూ.. ఉత్తమ సర్పంచ్ అవార్డు దక్కించుకుని గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం గ్రామస్తులందరికీ ఆనందాన్ని కలిగించిందని, ఆయనను సన్మానించడం గ్రామస్తుల బాధ్యత అన్నారు. గ్రామంలో ప్రజా సంక్షేమం కోసం నిత్యం కృషి చేస్తూ, ఉత్తమ సేవలందించిన శ్రీనివాస్ కు అవార్డు లభించడం అభినందనీయమన్నారు.