![]() |
![]() |
by Suryaa Desk | Fri, Dec 20, 2024, 03:15 PM
బెజూర్ మండలంలోని నాగ పెళ్లి దొడ్డి గూడ గ్రామాలలో పోలీసులు మీకోసంలో భాగంగా జిల్లా ఎస్పీ డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దుప్పట్లు, నిత్యవసర వస్తువులు, యువతకు వాలీబాల్ కిట్లను అందజేశారు. అనంతరం వైదశిబిరం ప్రారంభిచారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలైన నాగపల్లి దొడ్డి గూడ గ్రామాలకు రావడం సంతోషకరమని,గిరిజనులు అమాయకులని, చెడు వ్యసనాలకు బానిస కాకూడదని, యువత డ్రగ్స్ కి జూదానికి బానిసలు కాకూడదని అన్నారు. సంఘ వ్యతిరేక పనులు చేయకూడదనిసూచించారు. మార్గమధ్యలో వస్తుంటే రోడ్లు సౌకర్యం లేదని త్వరలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రోడ్లు బాగుపడేటట్లు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తులైన సర్మెడి శంకర్ మాట్లాడుతూ ఇంతవరకు ఎటువైపు ఏ అధికారి రాలేదని మొట్టమొదటిసారిగా ఎస్పీగా మీరు వచ్చారని, మా గిరిజన బాగోగులను,రోడ్ల వ్యవస్థను మెరుగుపడేటట్లు పై అధికారులకు,కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని అడుగగా, ఎస్పీ సమాధానం ఇస్తూ ఆదివాసులైన గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గిరిజనులు కొత్తగా వచ్చిన సైబర్ నెరగాళ్ల వల్లలో పడవద్దని పడినట్లయితే వెంటనే 1930 నెంబర్ కి కాల్ చేయాలని సూచించారు. పిల్లలను మంచి చదువులు చదివించాలని గవర్నమెంట్ హాస్టల్లో చేర్పించాలని తెలిపారు.
పోలీసులు అందరికీ మిత్రులేనని, సంఘ వ్యతిరేక పనులు చేసిన వారికి మాత్రమే శత్రువులని అన్నారు. అనంతరం విజేత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మరియు డిఎస్పీ గ్రామస్తులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామానుజం,సిఐ రమేష్, బెజ్జూర్ ఎస్సై కొట్టే ప్రవీణ్,పోలీస్ సిబ్బంది,సర్మెడి శంకర్,మండల రాయి మేడి రమేష్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు.