![]() |
![]() |
by Suryaa Desk | Fri, Dec 20, 2024, 03:17 PM
పెద్దపెల్లి జిల్లా, ధర్మారం మండల కేంద్రంలో పరికిపండ్ల నరహరి ఐఏఎస్ నిర్మించిన ఆలయ ఫౌండేషన్ ఉచిత కంటి ఆసుపత్రి ద్వారా శంకర ఐ హాస్పిటల్ ఇన్చార్జ్ పరికిపండ్ల రామ్ గారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం స్థానిక సాధన జూనియర్ కళాశాలలో విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ఫౌండేషన్ సీఈవో తీట్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఈరోజు శిబిరం ద్వారా 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించాము. ఇందులో నుండి దాదాపు 150 మందికి కంటి సమస్యలు ఉన్న రోగులను హైదరాబాద్ నర్సింగి లోని శంకర్ ఐ విజన్ సెంటర్ కు పంపించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సీఈవో తీట్ల రమేష్ బాబు, అడిషనల్ సీఈవో మిట్టపల్లి రాజేందర్ కుమార్, డిప్యూటీ సీఈవో కీర్తి నాగర్జున, హాస్పిటల్ ఇంచార్జ్ పరికిపండ్ల రామ్, ధర్మారం ఇంచార్జ్ మామిడిశెట్టి శ్రీనివాస్, సాధన జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గాజనవేణి కుమార్, వైస్ ప్రిన్సిపల్ ఉష్కమల్ల నారాయణ, హాస్పిటల్ డాక్టర్ల బృందం, కళాశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.