![]() |
![]() |
by Suryaa Desk | Fri, Dec 20, 2024, 03:25 PM
వికారాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం నుండి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయాల ముందు 48 గంటల నిరసన దీక్షలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మొదటి రోజు సిఐటి యు జిల్లా అధ్యక్షులు మహిపాల్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్, మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు.
లీలావతి లలిత వెంకటమ్మలు పాల్గొని మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి గ్రామాలలో పిఎస్సీలలో ప్రభుత్వ ఆసుపత్రులలో రాత్రింబవళ్లు డ్యూటీలు చేస్తూ చాలీచాలని జీతాలతో జీవితాలు వెలదీస్తున్న కాంట్రాక్ట్ అందరికీ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని, ప్రభుత్వం నిర్వహించే రాత పరీక్షలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పిలుపులో భాగంగా వికారాబాద్ లో నిరసన దీక్షలు చేపట్టారు.రాష్ట్ర ప్రభుత్వం మా న్యాయామైన సమస్యలు అసెంబ్లీ చర్చించి అందర్నీ ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని ప్రభుత్వానికి కొరత ఉన్నాం లేనిచో ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము.