![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 05:18 PM
మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుభాష్‌నగర్‌లో ప్లాస్టిక్ ట్రే గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడటంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తోంది.ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరిగినట్లు వివరాలు వెల్లడి కాలేదు. మంటలు అంటుకున్నాయని గుర్తించిన కార్మికులు వెంటనే బయటకు పరుగెత్తుకుంటూ వచ్చారని పోలీసులు తెలిపారు. స్థానికులు ఈ ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారని వెల్లడించారు. గోదాంలో ఉన్న ప్లాస్టిక్, ఫైబర్ అన్నీ మంటల్లో కాలిపోయాయని తెలిపారు