|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 12:16 PM
పటాన్చెరు : వసంత పంచమి పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ భవన్, ఆల్విన్ కాలనీ, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలలో నిర్వహించిన సరస్వతి దేవి పూజ కార్యక్రమాలలో పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు బండి శంకర్, నారాయణ రెడ్డి, పృథ్వి రాజ్, షకీల్, రామ్మోహన్, నవీన్ రెడ్డి, సత్యనారాయణ, ఉత్సవ కమిటీ సభ్యులు రవి, చటర్జీ, మండల్, తదితరులు పాల్గొన్నారు.