|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 02:29 PM
జలమండలి ఓ అండ్ ఎం డివిజన్-6 పరిధి.. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పరిధిలో సమస్యాత్మకమైన ప్రాంతాలను ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. మొదటగా జూబ్లీ హిల్స్ రోడ్ నెం.36 పోలీస్టేషన్ ప్రాంతంలో సరియైన సీవరేజ్ అవుట్ లెట్ సరిగ్గా లేని కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. దీంతో జలమండలి కొత్త 300 మిమీ డయా సీవరేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఈ ప్రాంతంలో సీవరేజ్ పైప్ విస్తరణ పనులు పరిశీలించారు. ఏళ్లనాటి సీవరేజ్ లైన్లు, రోడ్డుకింద పూడుకుపోయినట్టు, దీంతో మట్టి, చెత్త చేరి సీవరేజ్ సాఫీగా చేరకుండా.. ఓవర్ ఫ్లో అవుతున్నట్టు అధికారులు ఎండీకి వివరించారు. అలాగే ఈ ప్రాంతంలో భూగర్భంలో షీట్ రాక్‌ను కట్ చేయాల్సి ఉండటంతో పైప్ నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. శాశ్వత పరిష్కారం కోసం పనులు వేగవంతం చేసి , తాత్కాలికంగా సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఎండీ సూచించారు.
అనంతరం బంజారాహిల్స్ రోడ్ నెం.12 వద్ద 450 మిమీ డయా సీవరేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులు పరిశీలించి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఎండీ సూచించారు. రోడ్డు నెంబర్ 12 సితార గ్రాండ్ నుంచి విరించి ఆసుపత్రి వరకు ఉన్న సీవరేజ్ లైన్ ముప్పై ఏళ్ల నాటిది కావడంతో.. ఫ్లో పెరిగి తరుచూ 2 కిలోమీటర్ల మేరకు మురుగు పారేది. దీంతో ఈ ప్రాంతంలో సీవరేజ్ లైన్లను డీ-సిల్టింగ్ చేసి తాత్కాలికంగా సమస్యలని పరిష్కరించేవారు. శాశ్వత పరిష్కారంగా పైప్ లైన్ పునర్నిర్మాణం చేయాలని ఎండీ అశోక్ రెడీ అధికారులను ఆదేశించారు. పనులను వేగవంతం చేసేందుకు అదనపు సిబ్బంది.. యంత్రాలతో నెలలోపు ఈ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పని ప్రాంతాల్లో భద్రతా నిబంధనలను పాటిస్తూ అవసరమైన నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులకు ఎండీ ఆదేశించారు. పైప్‌లైన్ నిర్మాణం పనులు పూర్తికాగానే రోడ్డు పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీజీఎం ప్రభు, జీఎం ఇతర అధికారులు పాల్గొన్నారు.