|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 03:10 PM
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో ఆ ప్రాంతంలో సైనిక కదలికలు వేగవంతమయ్యాయి. తాజాగా అమెరికా తన సైనిక విమానాలను గ్రీన్‌లాండ్ దిశగా పంపడం కలకలం రేపుతోంది. దీనిని తమ సార్వభౌమాధికారానికి ముప్పుగా భావిస్తున్న డెన్మార్క్.. గ్రీన్‌లాండ్‌లోని తన వ్యూహాత్మక స్థావరాల వద్ద సైనిక బలగాలను రెట్టింపు చేసింది."అమెరికా చర్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. గ్రీన్‌లాండ్ డెన్మార్క్ రాజ్యంలో భాగం, దాని రక్షణకు మేము సిద్ధంగా ఉన్నాం" అని డెన్మార్క్ రక్షణ శాఖ ప్రకటించింది. మరోవైపు, రష్యా, చైనా ప్రభావం ఈ ప్రాంతంలో పెరగకుండా ఉండాలంటే గ్రీన్‌లాండ్ అమెరికా నియంత్రణలో ఉండాలని ట్రంప్ సర్కార్ వాదిస్తోంది.