|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 12:48 PM
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అభినందనలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం కీరవాణి స్వరాలు సమకూర్చడం ఒక చరిత్రాత్మక ఘట్టమని ఆయన అభివర్ణించారు. వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2,500 మంది కళాకారులతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తుండడం నిజంగా అద్భుతమని బండి సంజయ్ కొనియాడారు. సంగీతం, జాతీయ స్ఫూర్తి, ప్రతిష్ఠ అన్నీ కలగలిసిన ఈ కార్యక్రమం దేశానికి ఒక చారిత్రక నివాళి అవుతుందని ఆయన పేర్కొన్నారు.ఈనెల 26న జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో భాగంగా, కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ప్రదర్శన జరగనుంది. భారత స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిల్చిన 'వందేమాతరం' గీతం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 2,500 మంది కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొననుండగా, దీనికి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.