|
|
by Suryaa Desk | Sat, Jan 17, 2026, 06:09 PM
తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ మేరకు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.వివిధ కార్పొరేషన్‌లకు ఖరారు చేసిన రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌కు ఎస్టీ జనరల్, రామగుండం కార్పొరేషన్‌కు ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళ, మంచిర్యాల కార్పొరేషన్ బీసీ జనరల్, కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్, జీహెచ్ఎంసీ మహిళ జనరల్, గ్రేటర్ వరంగల్ జనరల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్‌లలో మహిళ జనరల్‌ను ఖరారు చేశారు.