|
|
by Suryaa Desk | Wed, Jan 14, 2026, 12:07 PM
పటాన్చెరు : రెండు నెలల క్రితం పరిశ్రమలో ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అండగా నిలిచారు. పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి మెరుగైన నష్టపరిహారం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. బొల్లారం డివిజన్ పరిధిలోని రాణే డై కాస్టింగ్ పరిశ్రమంలో రెండు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో కృష్ణ సింగ్ అనే కార్మికుడు మృతి చెందాడు. యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే కార్మికుడు మృతి చెందాడని.. మెరుగైన నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యే జిఎంఆర్ సూచించారు. ఇందుకు అనుగుణంగా పరిశ్రమ యాజమాన్యం 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించేందుకు అంగీకరించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో మృతుడి కుటుంబ సభ్యులకు నష్టపరిహారానికి సంబంధించిన 15 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా అందజేశారు. మరో ఐదు లక్షల రూపాయలు అతి త్వరలో అందజేయనున్నట్లు యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. కార్మికుల సంక్షేమం ఆర్థిక అభ్యున్నతి లక్షంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిటింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు సంజయ్ సింగ్, సునీల్ సింగ్, ప్రిన్స్, టీంకు, తదితరులు పాల్గొన్నారు.