|
|
by Suryaa Desk | Wed, Jan 14, 2026, 11:00 AM
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ సందర్భంగా ఈ నెల 15 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రద్దీని బట్టి ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు సీటీవో క్రాస్ రోడ్స్, ప్లాజా క్రాస్ రోడ్స్, టివోలి క్రాస్ రోడ్స్ మూసివేసే అవకాశం ఉంది. పండుగకు వచ్చేవారి కోసం ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ నుంచి వచ్చే వారికి పరేడ్ గ్రౌండ్ ఈస్ట్ గేట్ వద్ద, పంజాగుట్ట, ట్యాంక్ బండ్ నుంచి వచ్చే వారికి జింఖాన గ్రౌండ్స్‌లో, కూకట్ పల్లి, మేడ్చల్, బోయినపల్లి నుంచి వచ్చేవారికి దోభీఘాట్ లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. దోభీఘాట్ నుంచి పరేడ్ గ్రౌండ్ కు షటిల్ బస్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు.