|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 02:33 PM
ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షులుగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బేగంపేట హరిత టోల్ ప్లాజా హోటల్లో వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుళ్ళ రవి, కవ్వంపల్లి సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. కవ్వంపల్లి సత్యనారాయణ క్రమశిక్షణకు మారుపేరని, దళితుల పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయనకు అమితమైన ప్రేమ ఉందని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజాసేవలో ఉండే వ్యక్తి అని తుళ్ళ రవి కొనియాడారు. కరీంనగర్ జిల్లాలో ప్రతిపక్షాలను చీల్చి చెండాడే ఘనులు కవ్వంపల్లి సత్యనారాయణ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సేవను గుర్తించి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా పదవి ఇచ్చినందుకు ఆర్షం వ్యక్తం చేస్తున్నానని తుళ్ళ రవి తెలిపారు. త్వరలో అధిష్టానం సూచన మేరకు, గౌరవ ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు గారి సూచన మేరకు సన్మాన సభ నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి కచ్చితంగా అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు.