|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 04:14 PM
గర్భిణీలకు ఏఎన్సీ చెకప్ లపై ప్రత్యేక దృష్టి సారించాలని, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం వీర్నపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్ సీ)లో ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, ఏ.ఎన్.సీ నమోదు, ఎన్.సీ.డీ స్క్రీనింగ్ టెస్టులపై ఆరా తీశారు. వ్యాక్సిన్ గది, ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, ప్రభుత్వ వైద్యశాలల్లోనే ప్రసవాలు, చికిత్స పొందేలా గర్భిణీ స్త్రీల ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.