|
|
by Suryaa Desk | Sat, Jan 17, 2026, 05:50 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రపంచ దేశాలకు మరోసారి టారిఫ్ ల హెచ్చరికలు చేశారు. గ్రీన్ లాండ్ ను ఎలాగైనా తీసేసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేసిన ట్రంప్.. ఈ విషయంలో తమతో విభేదించే దేశాలకు టారిఫ్ లతో బదులిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా జాతీయ భద్రత విషయంలో గ్రీన్ లాండ్ చాలా కీలకమని, అయితే సులువుగా, కాకపోతే కఠిన పద్ధతిలోనైనా దానిని స్వాధీనం చేసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ ఆక్రమణను వ్యతిరేకిస్తే సహించబోనని చెప్పారు.ప్రపంచ దేశాలను ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ పరోక్షంగా డెన్మార్క్ ను నేరుగా హెచ్చరించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రీన్ లాండ్ ను అమెరికా ఆక్రమించుకోవాలని చూడడాన్ని డెన్మార్క్ మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.