|
|
by Suryaa Desk | Sat, Jan 17, 2026, 10:13 AM
రాబోయే 2026 ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వాతావరణ నిపుణులు ముందస్తు హెచ్చరికలతో కూడిన అంచనాలను వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ‘ఎల్ నినో’ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని, సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పెరిగి, ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఎండాకాలం రెండు దశల్లో కొనసాగుతుందని, ఫిబ్రవరి రెండో వారం నుంచి ఏప్రిల్ వరకు కొంత చల్లగా ఉండి, అనూహ్య వర్షాలు కురిసే అవకాశం ఉందని, మే నెల నుంచి జూన్ మధ్య వరకు ఎండలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎల్ నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటి నిల్వలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.