|
|
by Suryaa Desk | Wed, Jan 14, 2026, 09:16 PM
రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, సనత్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై కేసు నమోదైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేత రవి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తలసాని మాట్లాడారు. సికింద్రాబాద్‌ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తాం అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, తలసాని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.వివాదం ముదరడంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కేవలం ఆవేశంలోనే ఆ మాటలు అన్నానని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని తాను గౌరవిస్తానని తెలిపారు. అయినప్పటికీ, కాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్‌ఎంసీ విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడతామని తలసాని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.