|
|
by Suryaa Desk | Mon, Jan 19, 2026, 07:29 PM
మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అలియాబాద్ మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 4.83 కోట్లు, తుర్కపల్లికి రూ. 1.53 కోట్లు, మురహరిపల్లికి రూ. 1.55 కోట్లు, మజీద్పూర్ కు రూ. 3.09 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ. 3.19 కోట్లు, తుర్కపల్లిలో అదనంగా రూ. 16.60 లక్షలు వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, మౌలిక సదుపాయాల కల్పనతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.