|
|
by Suryaa Desk | Mon, Jan 19, 2026, 02:04 PM
హుస్నాబాద్ మండలం పూల్ నాయక్ తండాకు చెందిన బర్మావత్ మనోహర్ (27) అనే యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సోమవారం హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వైపు బైక్‌పై వెళ్తుండగా, పట్టణ శివారులోని సబ్ స్టేషన్ సమీపంలో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలై మనోహర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అమెరికాలో ఉద్యోగం చేసి, మూడు నెలల క్రితం స్వదేశానికి వచ్చి హైదరాబాద్‌లో సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ నడుపుతున్న మనోహర్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.