|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 12:49 PM
మహిళల దుస్తులపై జరుగుతున్న వివాదంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి స్పందించారు. కొద్ది రోజుల క్రితం నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులపై వ్యాఖ్యలు చేయడం, వాటిపై సినీ నటి అనసూయ వంటి వారు స్పందించడంతో మహిళల దుస్తుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ఎక్కువ మంది శివాజీకి మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళల దుస్తులపై రేణుకా చౌదరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి మీరెవరని ఆమె ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల వేదికగా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహిళలను అణగదొక్కాలని ఎవరు ప్రయత్నించినా వారికి తగిన గుణపాఠం చెబుతామని ఆమె అన్నారు. ఇటీవల ఒక మహిళా అధికారిపై మీడియాలో వచ్చిన వార్తలపై కూడా ఆమె తీవ్రంగా స్పందించారు. మహిళల విషయంలో తప్పుడు వార్తలు రాయడం ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు.