|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 01:13 PM
మామిడి పళ్ల సీజన్ రావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ, హైదరాబాద్ మార్కెట్లు అప్పుడే మామిడి పళ్లతో కళకళలాడుతున్నాయి. పండ్లలో రారాజు రాక వినియోగదారులకు సంతోషాన్నిస్తున్నా, వాటి ధరలు, రుచి మాత్రం నిరాశపరుస్తున్నాయి. నగరంలోని ఎర్రగడ్డ, మెహిదీపట్నం, ఎంజే మార్కెట్ వంటి ప్రధాన మార్కెట్లలో బంగినపల్లి, బెనిషాన్ రకం మామిడి పళ్లు దర్శనమిస్తున్నాయి.ప్రస్తుతం నాణ్యతను బట్టి కిలో బంగినపల్లి మామిడి ధర రూ. 200 నుంచి రూ. 300 వరకు పలుకుతోంది. సాధారణంగా సీజన్‌లో కిలో రూ. 50 నుంచి రూ. 60కే లభించే మామిడిని ఇప్పుడు ఇంత ఎక్కువ ధరకు కొనడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ధర అధికంగా ఉండటమే కాకుండా, ఈ పళ్లలో పులుపుదనం ఎక్కువగా ఉండి, ఆశించినంత రుచి లేదని కొనుగోలుదారులు చెబుతున్నారు.