|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 03:04 PM
తమిళనాడు అసెంబ్లీలో మరో వివాదం రేగింది. అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి ప్రసంగించాల్సిన గవర్నర్ మధ్యలోనే వెళ్లిపోయారు. సభలో జాతీయ గీతం పాడాలని కోరినా సభాపతి వినిపించుకోలేదని లోక్‌భవన్ వెల్లడించింది. దేశంలోని అన్ని శాసన సభలలో గవర్నర్ ప్రసంగానికి ముందు జాతీయ గీతాలాపన చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందని, స్టాలిన్ సర్కారు మాత్రం ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తోందని పేర్కొంది. దీనికి నిరసనగా గవర్నర్ ఆర్.ఎన్.రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినట్లు సమాచారం.ఈ పరిణామాలపై గవర్నర్ కార్యాలయం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో సభలో జాతీయ గీతాన్ని పాడకుండా ప్రభుత్వం అవమానించిందని లోక్ భవన్ విమర్శించింది. ప్రాథమిక రాజ్యాంగ విధిని విస్మరించిందని, గవర్నర్ ప్రసంగించడానికి వెళ్లిన సమయంలో మైక్‌ను పదేపదే ఆపివేశారని ఆరోపించింది. అసెంబ్లీలో తరచూ జాతీయగీతాన్ని అవమానిస్తుండడాన్ని సహించలేక గవర్నర్ సభలో నుంచి వెళ్లిపోయారని తెలిపింది.