|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 01:21 PM
సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరిలో విషాదం చోటుచేసుకుంది. కొడుకును స్కూలులో దింపి రావడానికి స్కూటీపై బయలుదేరిన ఓ తల్లి రోడ్డు ప్రమాదానికి గురైంది. స్కూటీ అదుపుతప్పి కిందపడగా.. వెనక నుంచి వచ్చిన ఆర్మీ వ్యాన్ వారిపైకి ఎక్కింది. ముందు టైర్ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన తల్లిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.తిరుమలగిరిలోని ఆర్మీ స్కూలు వద్ద జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.