|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 01:53 PM
టెక్ దిగ్గజం మెటాలో ఉద్యోగుల కోతలు కొనసాగుతున్నాయి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మెటావర్స్, వర్చువల్ రియాలిటీ విభాగాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ భారీ లేఆఫ్స్‌కు తెరలేపారు. తాజా నిర్ణయంతో దాదాపు 15,000 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు.ఇప్పటివరకు మెటావర్స్ కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను మెటా కుమ్మరించింది. అయితే, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా తన వ్యూహాన్ని మార్చుకుంది. వీఆర్ హెడ్‌సెట్ల కంటే ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్, వేరబుల్ గ్యాడ్జెట్లపై పెట్టుబడి పెట్టడం మేలని భావించిన మెటా అందుకు అనుగుణంగానే ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది.ఈ లేఆఫ్స్ నిర్ణయంపై ఓకులస్ వ్యవస్థాపకుడు పామర్ లక్కీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 2017లో కొన్ని వివాదాల కారణంగా జుకర్‌బర్గ్ చేత తొలగించబడ్డ పామర్.. ఇప్పుడు అదే జుకర్‌బర్గ్ నిర్ణయాన్ని సమర్థించారు. "VR రంగం ఆరోగ్యకరంగా ఎదగాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు అవసరమే. అనవసరమైన విభాగాలను తొలగించడం ద్వారా కంపెనీ తన లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలదు" అని ఆయన పేర్కొన్నారు.