|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 03:43 PM
బాన్సువాడ పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న పోచారం కుటుంబానికి తాను పలు సంవత్సరాలుగా విశ్వాసంగా మెలుగుతున్నానని, తన రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవ పట్ల తన నిబద్ధతను వివరించానని పట్టణానికి చెందిన నార్ల ఉదయ్ పేర్కొన్నారు. బుధవారం బాన్సువాడలో ఆయన మాట్లాడుతూ, పార్టీలు, రాజకీయ పరిణామాలు ఏవైనా సరే పోచారం కుటుంబంపై ఉన్న విశ్వాసం మాత్రం ఎప్పటికీ మారలేదని, మారదని స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం తనకు స్ఫూర్తిగా నిలిచిందని, ఈసారి అవకాశం లభిస్తే, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో బాన్సువాడ మున్సిపాలిటీలోని 16వ వార్డు నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. గతంలో అనేక ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో, ప్రజలకు అవసరమైన పనులను సాధించడంలో తాను క్రియాశీలకంగా వ్యవహరించానని గుర్తుచేశారు. పోచారం కుటుంబానికి విధేయుడిగా కొనసాగుతూ, బాన్సువాడ పట్టణ అభివృద్ధికి తనవంతు శక్తిని వినియోగిస్తానని నార్ల ఉదయ్ స్పష్టం చేశారు.