|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 03:38 PM
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సినిమా టిక్కెట్ ధరల పెంపునకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై టిక్కెట్ ధరల పెంపు ఉత్తర్వులను 90 రోజుల ముందే ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం టిక్కెట్ ధరల పెంపు విషయంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. ఈ చిత్రం టిక్కెట్ ధరల పెంపు ఉత్తర్వులపై న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.'రాజా సాబ్' చిత్రానికి సంబంధించి టిక్కెట్ ధరలపై ఈ నెల 9న వాదనలు జరిగాయని, 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి టిక్కెట్ ధరలను పెంచుతూ అంతకుముందు రోజు 8న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను వాయిదా వేసింది. అదే సమయంలో ఇకపై టిక్కెట్ ధరల పెంపు ఉత్తర్వులను 90 రోజుల ముందే ఇవ్వాలని ఆదేశించింది.