|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 02:06 PM
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో.. భారత మార్కెట్లో తన A సిరీస్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. తాజాగా 'ఒప్పో A6 5G' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 7,000mAh భారీ బ్యాటరీ, శక్తిమంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6000 ప్రాసెసర్, ఆకట్టుకునే కెమెరా ఫీచర్లతో ఈ ఫోన్ మిడ్-రేంజ్ విభాగంలో గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమైంది.భారత మార్కెట్లో ఒప్పో A6 5G మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999
6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999
6GB RAM + 256GB టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.21,999
ఈ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఇప్పటికే అమ్మకానికి అందుబాటులో ఉంది. కొనుగోలుదారులకు మరింత సౌలభ్యంగా ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ.1,000 తక్షణ క్యాష్‌బ్యాక్, మూడు నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. సఫైర్ బ్లూ, ఐస్ వైట్, సాకురా పింక్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభిస్తుంది.