|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 01:50 PM
అంతరిక్ష పరిశోధన రంగంలో ఒక శకం ముగిసింది. భారత సంతతికి చెందిన ధీశాలి, నాసా స్టార్ వ్యోమగామి సునీతా విలియమ్స్ (60) అంతరిక్ష ప్రయాణాలకు వీడ్కోలు పలికారు. ఆమె పదవీ విరమణ చేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) అధికారికంగా ప్రకటించింది. నిజానికి గతేడాది డిసెంబరు 27 నుంచే ఈ రిటైర్మెంట్ అమలులోకి వచ్చినట్లు వెల్లడించింది.సునీతా విలియమ్స్ పదవీ విరమణ చేసినా, ఆమె చేసిన పరిశోధనలు భవిష్యత్తులో జరగబోయే 'ఆర్టెమిస్' (చందమామపైకి పంపే మిషన్), అంగారక గ్రహ యాత్రలకు పునాదిగా నిలుస్తాయని నాసా పేర్కొంది. ప్రస్తుతం ఆమె భారత్ పర్యటనలో వున్నారు. తన తండ్రి స్వదేశమైన భారత్‌తో కలిసి ఇస్రో (ISRO) ప్రాజెక్టులలో ఏవైనా సలహాలు అందించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.