|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 03:00 PM
బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎంతో అవినీతి జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కవిత లేవనెత్తిన ప్రశ్నలకు, ఆమె చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణిపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వం 30 శాతం అధిక కేటాయింపులతో టెండర్లను అప్పగించిందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టులు పొందిన వ్యక్తులు ఇప్పుడు వారికి చెడ్డవారయ్యారా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్ట్) పాలసీపై కూడా బీఆర్ఎస్ నాయకులు ఇలాగే ఆరోపణలు చేశారని, అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇస్తే బహిష్కరించి వెళ్లిపోయారని ఆయన విమర్శించారు.