|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 11:34 AM
తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 పరీక్ష ఫలితాలపై తీర్పును వాయిదా వేసింది. ఈ వాయిదా అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఫలితాల ప్రకటనలో జాప్యం కారణంగా, అనేకమంది అభ్యర్థులు తమ భవిష్యత్తుపై అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ ఎప్పుడు జరుగుతుందో, తీర్పు ఎప్పుడు వెలువడుతుందో వేచి చూడాలి. అభ్యర్థుల ఆశలు, ఆందోళనల మధ్య ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.గత నెలలోనే సంబంధిత పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ ధర్మాసనం.. తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. అయితే ఇవాళ్టి తీర్పును ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తీర్పు ఇంకా రెడీ కాలేదని డివిజన్ బెంచ్ వెల్లడించింది.2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట్ శివనగర్‌కు చెందిన కె.పరుశరాములుతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి.. మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు.