|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 03:08 PM
గ్రేటర్ హైదరాబాద్ పోచారం సర్కిల్ లోని కొర్రెముల సుప్రభాత్ టౌన్ షిప్ లో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు కనీస పెన్షన్ ను రూ.10,000 కు పెంచాలని, గత కొన్ని సంవత్సరాలుగా కరువు భత్యంతో కూడిన పెన్షన్ అందించాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ, వారణాసి, కోల్ కత్తా, కొత్తగూడెంలలో భారీ ప్రదర్శనలు నిర్వహించినట్లు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించాలని పలుమార్లు మంత్రులు, అధికారులకు విన్నవించుకున్నామని పేర్కొన్నారు. మార్చి నెలలో కొత్తగూడెంలో జరిగే ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రదర్శనలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తీర్మానించారు.