|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 02:06 PM
రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిన్నారం గ్రామంలోని ఎన్ఎస్ఆర్ గార్డెన్‌లో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాస్త్ర మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు మరియు TGIIC చైర్మన్ శ్రీమతి నిర్మల జగ్గారెడ్డి గారు* ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలంటే ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండి సమస్యలను పోరాటంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల విశ్వాసమే కాంగ్రెస్ పార్టీ బలమని, అందరూ ఐక్యంగా పనిచేస్తే జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీల్లో విజయాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇంఛార్జి నీలం మధు, గాలి అనిల్ కుమార్, శశికళ యాదవ రెడ్డి, పుష్ప నాగేష్, సహా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.