|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 11:34 AM
మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డులలో సుమారు 93 వేల ఓటర్లు ఉన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం అధికారులు ప్రచురించిన ఓటర్ల జాబితాలో ఓట్ల తరలింపుపై గందరగోళం నెలకొంది. ఓటు బదిలీ చేసుకోకపోయినా, ఓట్లు ఇతర వార్డులకు తరలించారని నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక్కో వార్డులో 40 నుంచి 50 మంది ఓట్లు గల్లంతయ్యాయని, గెలుపుపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు తమ ఓట్లు వేరే వార్డులకు వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాంనగర్, తాళ్లగడ్డ, చైతన్య నగర్ వంటి ప్రాంతాలలో ఓట్ల తరలింపు జరిగినట్లు ప్రజలు వాపోతున్నారు. ఇందిరమ్మ కాలనీలో గతంలో 2600 ఓట్లు ఉండగా, ప్రస్తుతం 3 వేలకు పెరిగాయని, ఇక్కడ కూడా ఇతర వార్డుల నుంచి ఓట్లను చేర్చారని విమర్శలు వస్తున్నాయి.