|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 11:04 AM
TG: హైదరాబాద్‌లో ఒకే నంబర్ ప్లేట్ (TS34C1858) తో నాలుగు బైకులు రోడ్లపై తిరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు గుర్తించి ఆశ్చర్యపోయారు. చలాన్స్ మాత్రం ఒక్కరి పేరు మీద మాత్రమే పడుతున్నాయి. ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి చలాన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. ఆ చలాన్ ఆ నెంబర్ ప్లేట్ ఉన్న బైక్ ఓనర్ బేగరి గోపాల్ కు చేరడంతో షాక్ కు గురయ్యాడు. అప్పటికే తన బైక్ పై పలు చలాన్లు ఉండడంతో ఆశ్చర్యపోయాడు.వెంటనే అప్రమత్తమైన గోపాల్ చలాన్లు పడ్డ బైక్ ఫోటోలు చూసి ఆ వాహనాలు తనవి కాదని గోపాల్ ట్రాఫిక్ పోలీసులకు తెలియజేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఒకే నెంబర్ ప్లేట్ తో నాలుగు బైకులు ఉన్నట్లు గుర్తించారు. బాధితుడి బైక్ BHEL లో ఉండగా.. అదే నెంబర్ ప్లేట్ తో తిరుగుతున్న వాహనాలు వికారాబాద్, సంగారెడ్డి, బేగంపేట లో ఉన్నట్లు గుర్తించారు. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసి నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను కోరాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.