![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 06:01 PM
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. రేపు ఉ. 11 గంటలకు ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 19 లేదా 20న వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి 3 లక్షల 20 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.