![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 05:15 PM
యూట్యూబ్ చానల్ తో ఎంతో పాప్యులరైన యూట్యూబర్ అన్వేష్ తో తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి సజ్జనార్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. "మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ తో సంభాషించాను. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ గురించి, అటువంటి యాప్స్ కు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ ప్రచారం కల్పిస్తుండడం, ప్రజలపై పడే ప్రభావం వంటి అంశాలు అతడితో చర్చించాను. అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి కూడా మాట్లాడాను" అని సజ్జనార్ వివరించారు. తన చిట్ చాట్ కు సంబంధించిన వీడియో లింకును కూడా ఆయన పంచుకున్నారు. కాగా, యూట్యూబర్ అన్వేష్ ఇప్పటిదాకా 128 దేశాలను ఎక్స్ ప్లోర్ చేయడం పట్ల సజ్జనార్ అభినందించారు. ఆయా దేశాల్లో బెట్టింగ్ యాప్ ల గురించి అడిగారు. అక్కడి ప్రజలు కూడా బెట్టింగ్ యాప్ ల పట్ల ప్రభావితం అవుతుంటారా అని అడిగి తెలుసుకున్నారు