![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 05:12 PM
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ భేటీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామరెడ్డి ఉన్నారు.తెలంగాణలోని 55 సమీకృత గురుకులాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు కేటాయించింది. ఈ నిధుల కేటాయింపుపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, రామసహాయం రఘురామరెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఒక్కో పాఠశాలకు రూ. 200 కోట్లు కేటాయించడం రాష్ట్ర చరిత్రలో తొలిసారి అని వారు పేర్కొన్నారు. పేద పిల్లలకు నాలుగో తరగతి నుండి ఇంటర్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉచిత విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు రూపకల్పన చేసిందని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. నిధుల అంశంపై చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలిచినా వెళతామని అన్నారు.