![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 12:18 PM
జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ సత్యప్రసాద్ ఐఏఎస్ గారు తన సతీమణితో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు మరియు తలంబ్రాలు సమర్పించారు.మార్చి 10 నుండి మార్చి 22 వరకు జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా కలెక్టర్ గారు ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా మంచినీటి వసతులు, శానిటైజేషన్, భద్రతా చర్యలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.తదుపరి, కలెక్టర్ గారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి తో కలిసి అన్నదాన సత్రాన్ని పరిశీలించారు. భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహణను పరిశీలించి, వారికి స్వయంగా భోజనం వడ్డించి వారు కూడా భక్తులతో భోజనం చేశారుఅలాగే, కళ్యాణ మండపం ఏర్పాట్లను కూడా పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో శ్రీ మధుసూదన్, ఎమ్మార్వో శ్రీ కృష్ణ చైతన్య, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.