![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 11:50 AM
సమాజంలో నాయీబ్రాహ్మణుల సేవలు శ్లాఘనీయమని ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ అన్నారు. నాయీబ్రాహ్మణులకు మంజూరైన ఈఎస్ఐ కార్డులను మంగళవారం ఓల్డ్ బోయినపల్లిలోని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జగదీష్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా నర్సింహులుతో కలిసి కార్పొరేటర్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంఘం సీనియర్ నాయకులు పాల్గొన్నారు.