|
|
by Suryaa Desk | Thu, Mar 13, 2025, 03:49 PM
వేమనపల్లి మండలంలోని జక్కపల్లి గ్రామంలో అభివృద్ధి పనులను గురువారం మాజీ జెడ్పిటిసి సంతోష్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ సాబీర్ అలీలు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
రూ. 20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు అభివృద్ధి పనులను చేపట్టినట్లు వెల్లడించారు.