![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 06:05 PM
హైదరాబాద్‌కు చెందిన లెజెండరీ భారత మాజీ ఆల్‌రౌండర్ సయ్యద్ అబిద్ అలీ (83) అనారోగ్యంతో కన్నుమూశారు. 1967-1975 కాలంలో భారత్ కు అబిద్ అలీ ప్రాతినిధ్యం వహించారు.
ఆయన క్రికెట్ లో లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మాన్, మీడియం పేస్ బౌలర్ గా రాణించాడు. ఆయన తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆడారు. అబిద్, 1975 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌పై 70 పరుగులు చేశాడు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.