![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 09:50 PM
జన్వాడ ఫామ్‌హౌజ్‌పై డ్రోన్ ఎగరేశారంటూ 2020 మార్చిలో నార్సింగి పీఎస్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. రేవంత్ తరఫు న్యాయవాది జన్వాడ ఫామ్‌హౌజ్ నిషేధిత ప్రాంతమేమీ కాదన్నారు.
తప్పుడు కేసులు బనాయించి రేవంత్‌ను జైలుకు పంపించారన్నారు. కాగా, పీపీని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా వేసింది.