![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 04:22 PM
రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మహేష్ గౌడ్ అన్నారు. బుధవారం ఉట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు.
ప్రతి గీత కార్మికుడికి కాటమయ్య రక్షణ కిట్లు అందించాలని, చనిపోయిన గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు.