![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 05:49 PM
వేములకుర్తి గ్రామంలోని అతిపురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఆలయంలో యజ్ఞ అర్చకులు చక్రపాణి.
నర్సింహమూర్తి చార్యులు స్వామివారి మూలవిరాటు, ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలోని యజ్ఞమండపంలో స్వామి వారిని అవాహనం చేసి శాంతి యజ్ఞం ప్రారంభించారు.